Friday, April 3, 2026

దళిత బంధు నిధుల జాడేది ఎదురు చూస్తున్న దళిత బిడ్డలు

  • జేడీఎస్ నేత వాసు వడ్లూరి

నేటి సాక్షి, హుజురాబాద్ : రెండో విడత దళిత బంధు నిధులపై బ్యాంకులో ఫ్రీజింగ్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేటి వరకు నిధుల పై ఫ్రీజింగ్ ఎత్తివేయలేదని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు. గురువారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ దళిత బంధు కొటేషన్ల పేరిట గతంలో దళారులు కోట్లు దండుకున్నారని దళారీ వ్యవస్థ లేకుండా ఆ నిధులు నేరుగా వారి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పైరవీలకు తావు లేకుండా నిధులపై వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి దళితుల జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. ఏదో ఒక ఎన్నికల పేరిట ప్రభుత్వం నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేసే విషయంలో కావాలనే కాలయాపన చేస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. నియోజకవర్గంలోని దళితులు మనోవేదనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం కాలయాపనకు స్వస్థ పలికి దళితుల ఎకౌంట్లో ఉన్న డబ్బుపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News