
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : వేములవాడ రూరల్ మండల తాసిల్దారుగా అబు బాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎమ్మార్వో కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అబూ బాకర్ మాట్లాడుతూ.. రూరల్ మండలంలో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు వీధి నిర్వహణలో తోడ్పాటు అందించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..





