నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ శరత్ రావు, ఎఏంసి చైర్మన్ పులి కృష్ణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని, దళారుల ద్వారా తక్కువ ధరలకు అమ్మకాలను నివారించేందుకు ఇది సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు దామోదర్, డైరెక్టర్లు మల్లేశం, సంతోష్, కుమార్, పోచయ్య, రాజు, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భూమయ్య, రాజేశం, రావుల నర్సయ్య, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





