Friday, April 3, 2026

రేషన్ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి

  • తాసిల్దార్ వెంకట రమణ

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రాపురం:
రేషన్ సరుకులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని రామచంద్రాపురం మండల తాసిల్దార్ వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉండే సభ్యులందరూ ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. ఇప్పటికే కేవైసీ చేసుకున్న వారు అవసరం లేదని ఎవరైతే చేసుకోకుండా ఉంటారు వారందరూ తప్పనిసరిగా వారి రేషన్ షాప్ నందు ఈనెల 31వ తేదీ లోపల ఈ కేవైసీ చేసుకోవాలన్నారు. ఈకేవైసీ చేసుకొని ఎడల ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వారికి దేశం సరుకులు ఇవ్వబడుతున్నారు. ఎవరు చేసుకోవాలో వారి యొక్క పేర్లను వారి రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఇచ్చామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News