Friday, April 3, 2026

పిచ్చుకలను అందరూ సంరక్షించాలి

నేటి సాక్షి, వేమనపల్లి : కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని నీల్వాయి ఎఫ్ఆర్ఓ అప్పలకొండ గురువారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకొని పిలుపునిచ్చారు.రేంజ్ పరిధిలో ప్రతి బీట్,సెక్షన్ లో పక్షుల కోసం నీళ్ళు అందుబాటులో పెట్టామని,ప్రతి ఒక్క అధికారికి సూచించామని అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎండాకాలంలో వాటికి గూడు తయారు చేసి మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని,వాటిని సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు.పక్షులతోనే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుందని తెలిపారు.ఇండ్లల్లో పిచ్చుకలను కాపాడుకునేందుకు గూడు ఏర్పాటు చేసి నీళ్ల సదుపాయం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్ కుమార్,బీట్ అధికారి మహిపాల్ పాల్గొన్నారు.

పర్యావరణంలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించాలి:-

కుశ్నపల్లి రేంజ్ పరిధి వేమనపల్లిలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అటవీ కార్యాలయంలో పిచ్చుకల కొరకు నీళ్ల సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణంలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించే అధికారం ఉందన్నారు.వాటిని కాపాడే బహత్తర కార్యక్రమం మానవాళిపై ఉందని,రేడియేషన్ ప్రభావంతో సెల్ టవర్ల యొక్క ప్రభావం వల్ల కొన్ని జీవులు అంతరించిపోతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అటవీ సెక్షన్ అధికారి బేగ్,అటవీ బీట్ అధికారి సోఫియా బేగం,బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News