Friday, April 3, 2026

మహిళా సంఘాలపై హుకుం జారీ చేస్తున్న చిలకటోనిపల్లి బుక్ కీపర్..?

  • మేం చెప్పిన వారికి ఓటు వేస్తేనే మహిళా సంఘం లోను అందుతుంది
  • కోపోద్రిక్తులవుతున్న మహిళలు
  • కలెక్టర్ ఏపీఎంలు ఏం మాట్లాడకూడదు
  • నేను చెప్పిందే తదస్తు.
  • నా వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు నన్ను కాదు కూడదు అంటే మీ అంతు చూస్తా…?
  • చేతివటం అందకపోతే లోను రికవరీ& కొత్తలోనూ చేయడం కుదరదు
  • చిలకటోని పల్లి బుక్ కీపర్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మహిళా సంఘాలను అదునుగా చూసుకొని ఎమ్మెల్యేను ఓటు బ్యాంకు కోసము లొంగ తీసుకుంటూ బుక్ కీపర్ లకు చేతులు తడపకపోతే లోను రావడం కష్టమని తెగేసి చెప్తున్నా పెద్దమందడి మండలంలోని ఒక బుక్ కీపర్. మేం చెప్పిన వారికి ఓటు వెయ్యనందుకు నీకు మహిళా సంఘాలలో లోను సాంక్షన్ కావడంలేదని తెగేసి చెబుతున్న చిలకటోనిపల్లి బుక్ కీపర్. అధికార పార్టీకి ఓటు హక్కు వినియోగించుకోనందుకు మీకు లోన్ శాంక్షన్ కావడం లేదని మహిళలకు హుకుం జారీ చేసిన బుక్ కీపర్. మా ఇష్టం ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకుంటాం ఓటుకు మహిళా సంఘాలకు సంబంధం ఎందుకు వస్తుందని కోపద్రకులవుతున్న మహిళా సంఘాలు. కలెక్టర్ ను, జిల్లా అధికారులను, ఏపీఎంను సహా లెక్కచేయకుండా నా దగ్గర ఓటు బ్యాంకు ఉంది నేను సమ్మతి పలుకుతే నీకు ఓటు బ్యాంకు పెరుగుతుంది అని ఎమ్మెల్యేకు ఉకుం జారీ చేస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యేతో మన్ననలు పొందుతూ దొరికిన కాడికి దోచుకుంటూ మహిళలను అనగతొక్కుతున్న చిలక టోనిపల్లి గ్రామ బుక్ కీపర్. పూర్తి వివరాలకు వెళ్తే… గత కొంత కాలంగా చిలకటోని పల్లి గ్రామంలోని 15 మహిళా సంఘాల గ్రూపులకు బుక్ కీపర్ గా పనిచేస్తూ వారు చెప్పిన పార్టీకే ఓటు బ్యాంకు ఇవ్వాలని కుం జార్చేస్తూ అధికార పార్టీకి బానిసగా మహిళలను పరిగణనలోకి తీసుకుని మీరు మా ఎమ్మెల్యే కు ఓటు వేసి సహకరిస్తూ జండా మోస్తేనే మీకు లోను జారీ చేయమన్నాడని ఎమ్మెల్యే హుకుం జారీ చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు పలుకుతూ మహిళలను తప్పుదోవ పట్టిస్తూ, మీకు లక్షల లోనిస్తున్నందుగాను మాకు తగిన వ్యయం చెల్లించాల్సిందిగా పై అధికారులు హుకుం జారీ చేస్తున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండల ఏపీఎం నాగమణి మాట్లాడుతూ… మహిళా సంఘాలలోనుకు సంబంధించి బుక్ కీపర్ లాగా గాని మరి ఇతర అధికారులకు గాని ఎలాంటి మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా అడిగితే మమ్మల్ని సమర్థిస్తే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News