- మాట కంటే పాట పదునైనది కవులకు ఘన సన్మానం
- కష్టజీవుల చెమట చుక్కనే కవిత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండేది కవిత్వం
- ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
శుక్రవారం బిజినపల్లి మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ మాట్లాడుతు ప్రపంచ కవితా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతుంది 1999లో యునెస్కో వారిచే నిర్ణయించబడిన ప్రపంచ కవితా దినోత్సవం రోజున కవిత్వాన్ని పరిచయం చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కవులను వారి రచనలను ప్రజలకు వివరించడం వారిలో చైతన్యాన్ని నింపడం ఈ కవితా దినోత్సవం ప్రత్యేకత. పురాతన సాహిత్య రూపమైన కవిత్వమును కవిని గౌరవించే సంప్రదాయం మన దేశంలో ఆనవాయితీగా వస్తున్నది అనేక మంది భారతీయ రాజులు కవిత్వాన్ని కవులను పోషించేవారు తొలిసారిగా 18వ శతాబ్దంలో ఐరోపాలో రోమన్ కవి విర్రినా పేరున అక్టోబర్ నెలలో కవితా దినోత్సవం నిర్వహిస్తుండే వారు కానీ1999 లో పారిస్ లో యునెస్కో 30సమావేశం జరిగింది ఈ సంవత్సరం నుండి మార్చి 21వ తేదీని ప్రపంచ కవితా దినోత్సవం జరపాలని ఎంచుకున్నారు .రవి గాంచని చోట కవి గాంచును కష్టజీవుల చెంతన ఉండి అన్యాయాలకు గురవుతున్న వ్యక్తుల పక్షాన నిలిచి పాలక ప్రభుత్వాలను ధిక్కరించే స్వరమై ప్రజలకు నోటి పాటై ఉద్యమకారులకు మాటల తూటాల మారి మనుషులను ఉత్సాహంగా ఉల్లాసంగా పరుస్తూ హక్కుల సాధన కోసం నిలబడి కలవడానికి శక్తినిస్తుంది ,యుక్తి నిస్తుది , పాలకులను దిక్కరించి మని శక్తినిస్తుంది, హక్కులకోసం నిలబడడానికి మహత్తర శక్తిని ఇస్తుంది, బహుజనులకు బంధూకుగా నిలుస్తుంది ,కవిత్వమంటే కష్టజీవుల చెమట చుక్కల పాటలమూట.కవులు తమ రచనలను వచన కవిత్వం, పద్య కవిత్వం , గేయకవిత్వం, ప్రజల కష్టనష్టాలను గుర్తెరిగి ప్రజల కోసమే కవిత్వాన్ని రాసినటువంటి కవులు ధిక్కార కవులుగా నిల్చున్నారు.తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు నిజాం నిరంకుశ పాలనలో పాట ప్రజా చైతన్యం వై పారుతున్న ఊట ప్రజా చైతన్యం చేయడానికి ప్రజలు చెంతన నిలిచి ప్రజల కష్టాలు లో ప్రజల గొంతు నుండి మారుమ్రోగి కదిలింది కవిత్వం జనచైతన్య కవిత్వం పాట ప్రతి చోట ప్రతి పూట ప్రజలుపాడుకునే పాట శక్తివంతమైనది .నన్నయ ,తిక్కన, ఎర్రన, వేమన ,తిరుపతి వేంకట కవులు, శ్రీ శ్రీ, గుర్రం జాషువా, బోయి భీమన్న ,గద్దర్, వంగపండు , అందెశ్రీ ,సినారె, దాశరధి, గూడ అంజన్న ,బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, గురజాడ అప్పారావు, గోరేటి వెంకన్న, రాజారాంప్రకాష్ , మొదలగు కవుల ను స్పూర్తిగా తీసుకుని యువతరం రచనలు చేయాలని సమ సమాజ నిర్మాణం కోసం కవిత్వాన్ని బతికించాలి అని ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ కవులను కోరారు. కవి గాయకులైన అశోక్ కుమార్, కొములయ్య లను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రత్నశేఖర్, మహమ్మద్, అశోక్ కుమార్, కొములయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఇందుమతి, ప్రమీల, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.





