నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వీపనగండ్ల రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించి ఉద్యమాలను ఆపలేరని సిఐటియు మండల నాయకులు ఆశన్న ఆరోపించారు. శుక్రవారం నాడు బిల్డింగ్ వర్కర్స్ సమస్యల పైన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదని ఆశన్న అన్నారు. 60 సంవత్సరాలు నిండిన బిల్డింగ్ కార్మికునికి పెన్షన్ 10000 ఇవ్వాలని, వారి కుటుంబంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు వర్తింపచేయాలని, పెండింగ్ లో ఉన్న 11 లక్షల లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాదులో కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుండగా పోలీసులు బిల్డింగ్ వర్కర్స్ ను అడ్డుకోవడం జరిగిందని ఆయన ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు నాయకులు వెంకటేష్ గౌడ్, రామన్ గౌడ్, లక్ష్మణ్, రాముడు, రఘు పాల్గొన్నారు.





