Friday, April 3, 2026

వీధి కుక్కల బారి నుండి చిన్నపిల్లలను , ప్రజలను కాపాడండి

  • ఇళ్లల్లోకి వెళ్లి మహిళలను వేధిస్తున్న కోతులను పట్టి అడవుల్లో వదిలేయండి
  • అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి లో వీధి వీధికి 30 నుండి 50 వరకు కుక్కలు సంచరిస్తూ చిన్న పిల్లల వెంట పడుతూ వారిని కరుస్తున్నాయని, అలాగే పాదాచారులు అయిన మహిళలపై టూ వీలర్స్ పై వెళ్లే పురుషులపై దాడి చేస్తున్నాయని, వీధి కుక్కలు ఎక్కువైనా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కుంటి సాకులు చెప్పుతూ అధికారులు కాలం వెళ్లిపుచ్చుతున్నారనీ. అలాగే కోతులు వందలుగా, మందలుగా తిరుగుతూ ఇంట్లోకి వచ్చి మహిళలపై దాడి చేస్తున్నాయని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కమీషనర్ ను, సానిటరీ ఇన్స్పెక్టర్ ను ప్రశ్నించిన ఐక్యవేదిక . గతంలో యాంటీ బర్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలను అక్కడికి తరలించే వారినీ , దానికై మున్సిపాలిటీ నుండి కోటి రూపాయల నిధులు కేటాయించారని అది వృధాగా ఉందని కనుక వెంటనే దాన్ని వినియోగంలోకి తెచ్చి కుక్కల్ని పట్టి అక్కడ సంరక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికడి యాదయ్య, బీ.ఎస్.పి టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News