- ఉన్న స్థానంలోనే నూతన కోర్టు భవనాల నిర్మాణం అజెండాతో ప్రభాకర్ రెడ్డి ప్యానల్ నామినేషన్లు
నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 29న జరగబోయే రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గురు, శుక్ర వారాలలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాయచోటి బార్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న ఎన్ ప్రభాకర్ రెడ్డి మరొకసారి ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేయడానికి శుక్రవారం తన మద్దతుదారులైన న్యాయవాదులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారి రాజ్ కుమార్ రాజు ఎదుట నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్యానెల్ లోనే ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయడానికి పి రెడ్డి భాషా , స్పోర్ట్స్ కార్యదర్శిగా పోటీ చేయడానికి వి. సిద్దయ్య లు కూడా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్. ప్రభాకర్ రెడ్డికి పోటీగా వై రమేష్ రెడ్డి అధ్యక్షుడు గాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పి రెడ్డి భాషాకు పోటీగా పి శ్రీనివాసులు గురువారం నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగుతున్న ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పాత కోర్టు స్థానంలోనే నూతన కోర్టు భవనాలను నిర్మించాలని ఒక ప్రధానమైన అజెండాతో బార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కోర్టు నూతన భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా వచ్చిన వారిలో భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు టీ.ఈశ్వర్ ఐ ఏ ఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందకుమార్ సీనియర్ న్యాయవాదులు రఘురామిరెడ్డి దేవేందర్ రెడ్డి, చిన్నయ్య, ధనుంజయ్ కుమార్ రెడ్డప్ప రెడ్డి పి రెడ్డయ్య డి నాగ ముని ఖాదర్ బాషా రామ్మోహన్ రెడ్డి హుమయున్ భాష టీవీ రమణ కే వరలక్ష్మి ఎం రవిశంకర్, నిరంజన్ ఆదిరెడ్డి నాయక్ ఆర్డి ఆనంద్, రామచంద్రయ్య ఎం శివకుమార్, జగదీష్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తన మద్దతు దారులతో కలిపి ఎలక్షన్ ఆఫీసర్ రాజకుమార్, రాజు, ఎదుట, నామినేషన్ దాఖలు చేస్తున్న ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆయన ప్యానల్ సభ్యులు.





