Friday, April 3, 2026

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూ డి ఐ డి యూనిక్ డిజేబుల్ ఐడిని అమల్లోకి తీసుకొచ్చారు…!!!

  • వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడి అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూ డి ఐ డి ( యూనిక్ డిజేబుల్ ఐడి)ని అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో యు డి ఐ డి పోర్టల్ ద్వారానే దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేయడం జరుగు తుందని చెప్పారు. యూ డి ఐ డి కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకో వాలన్నారు. ఆన్లైన్ లో అప్లై చేసి లాగిన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా, వైద్యులు అసెస్మెంట్ చేయడానికి తేదీ నిర్ధారించడం జరుగుతుందన్నారు. వైద్యుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత దివ్యాంగులకు యూడిఐడి కార్డు పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుందని చెప్పారు.గతంలో సదరం పోర్టల్ ద్వారా కేవలం 7 డిజేబులిటీస్ కి మాత్రమే అవకాశం ఉండేదని, ఇప్పుడు యూ డి ఐ డి పోర్టల్ లో 21 డిజిబిలిటీస్ కి అవకాశం ఉందని చెప్పారు. దివ్యాంగులకు యూ డి ఐ డి అప్లై చేసే విషయంలో మీసేవ ఆపరేటర్లది కీలక పాత్రని, ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో దివ్యాంగుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని చెప్పారు. ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మీసేవ ఆపరేటర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డి ఆర్ డి వో ఉమాదేవి, డిఎంహెచ్వో శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News