నేటి సాక్షి మహబూబాబాద్ ,(భూక్యా రవి ) : నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ ప్రతినిధి కొండబత్తిని రవికుమార్ తల్లి అనసూర్య ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందారు.అనంతరం ఇంటికి వచ్చిన వారి కుటుంబాన్ని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ శుక్రవారం పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్, తొర్రూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొత్త రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండ బిక్షం రెడ్డి, సీనియర్ నాయకులు నెలకుర్తి సత్తిరెడ్డి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ లు మిర్యాల వెంకన్న,బొల్లం రమేష్,డైరెక్టర్ తాడూరి వెంకన్న,గ్రామ మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న, మాజీ మండల యూత్ అధ్యక్షుడు బండి రమేష్, సోషల్ మీడియా ఇంఛార్జి మారపంగు వీరన్న, పెండెం యాదగిరి, రేఖ శీను, లక్పతి, బిచ్చు, అంకం రామకృష్ణ, రెడ్యా తదితరులు ఉన్నారు.





