
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : zతిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. తమ మనువడు నారా దేవాన్ష్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44 లక్షల ఖర్చును ఆన్‌లైన్ ద్వారా విరాళంగా అందించారు.





