నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ IRS కలిసి ఎల్లందు JK ఓసీ, కొత్తగూడెం GK ఓసీకి సంబంధించిన అనుమతుల ఆలస్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరిన సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల KTPS విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పనులను వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా జైపూర్లో 800 మెగావాట్ల అదనపు విద్యుత్ ప్లాంట్ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర కోల్ సెక్రటరీతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలియజేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన సింగరేణి సీఎండీ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC సింగరేణి జనరల్ సెక్రటరీ శ్రీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.





