Friday, April 3, 2026

27 న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పి డి ఎస్ యు సదస్సు పోస్టర్లు ఆవిష్కరణ.

  • స్వయంప్రతిపత్తితోనే విద్య అభివృద్ధి
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ దుబ్బా రంజిత్

నేటి సాక్షి – మేడ్చల్ జిల్లా ప్రతినిధి : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సదస్సు పోస్టర్లను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నందు ఆవిష్కరించడం జరిగినది. నిజం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దుబ్బా రంజిత్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.కేంద్ర విశ్వవిద్యాలయాల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా సమస్యల సుడిగుండంలో వదిలేసిన కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బ తీసే విధంగా యుజిసి నిబంధనలను నూతనంగా తమకు అనుగుణంగా రూపొందించి మొత్తం విద్యా వ్యవస్థనే తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుందని, యూనివర్సిటీలకు గ్రాంట్స్ తగ్గిస్తూ వస్తు యూనివర్సిటీల అభివృద్ధిని మరిచిన కేంద్రం రాష్ట్ర యూనివర్సిటీలో కేవలం కర్ర పెత్తనం కోసమే ప్రయత్నం చేస్తుందని, ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ, కార్పొరేట్ శక్తులకు ఉతమిస్తున్న కేంద్రం విద్యారంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ పరం చేయాలని చూస్తుందని, విద్యను వ్యాపార సరుకుగా చూసే కార్పొరేట్ శక్తులు పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షల చేస్తుందని కావున ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం కొరకు ప్రభుత్వం యూనివర్సిటీలకు అధిక నిధులను కేటాయించాలని యూజిసి నూతన నిబంధనలను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర యూనివర్సిటీలపై కర్ర పెత్తనాన్ని వెనక్కి తగ్గాలని కోరుతూ యు జి సీ నూతన నిబంధనలు యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి” అనే అంశంపై నూతన విద్యా విధానం- 2020 ని వ్యతిరేకిస్తూ మార్చి-27 న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సదస్సుకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ సాంబ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గణేష్, పి డి ఎస్ యు మేడ్చల్ – రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మందుల సైదులు, హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు సుధీర్, సమన్, ఉదయ్, ప్రవీణ్, సిద్దు, స్వాతి, వినిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News