- హసన్పర్తి పి హెచ్ సి ముందు ఆశా వర్కర్ల నిరసన
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు బడ్జెట్ ను పెంచాలని, ఆశా వర్కర్లను మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26,000/- లు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆశా యూనియన్ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ దేశ వ్యాప్తంగా నిరసన కార్య క్రమo హసన్ పర్తి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు అరగంట పాటు ధర్నా చేయడం జరిగింది. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంద జేశారు ఈ కార్య క్రమంలో సిఐటియు హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కు కేంద్ర బడ్జెట్లో నిధులను తగ్గించారని దానిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు గ్రామీణ స్థాయిలో పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రయాణ ఖర్చులను అందించాలని అందుకోసం టూ..వీలర్ స్కూటర్లను అందించాలని ప్రజలకు నాణ్యమైన మందులు ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేశారు ఆశాలకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించాలని రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పుల్లా అశోక్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ రాజేశ్వరి డి నవమణి శోభ వి. శైలజ సరిత ఎన్ రజిత విజయ కుమారి బొక్క సునీత తదితరులు పాల్గొన్నారు.





