Friday, April 3, 2026

మానవ అక్రమ రవాణా నిర్మూలనకు అవగాహన కార్యక్రమం

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలకేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మానవుల అక్రమ రవాణా మరియు సైబర్ ఆధారిత అక్రమ రవాణా శిక్షణ కార్యక్రమం గ్రామ సంఘ అధ్యక్షులు మరియు వివోఏలకు ఒక్కరోజు శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టాలపై అవగాహన, టీనేజ్ అమ్మాయిలు కాలేజీకి వెళ్లే అమ్మాయిలు వాట్సాప్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, అమ్మాయిలకు మత్తు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు దేశాలకు లైంగిక వ్యాపారం చేయడం జరుగుతుందని, వీటిపట్ల మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి మోసాలకు గురికాకుండా అమ్మాయిలను కాపాడుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఎం నర్సయ్య,హెడ్ కానిస్టేబుల్లు జనార్ధన్, బేగ్, కానిస్టేబుల్ సంపత్ రెడ్డి, సీసీ సారయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News