నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలోని ఆలయాల్లో గో సంరక్షణ శాలల నుండి గత కొన్ని రోజుల నుండి గోవులు చోరికి గురౌతున్నయాని, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని నిరసిస్తూ బిజెపి శ్రేణులు మంగళవారం రాయికల్ లో రాస్తారోకోకు దిగారు. ఎర్రటి ఎండలో రాయికల్, జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి గోవులను ఎత్తకెళ్లుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. రాయికల్లోని శ్రీలలితాంబిక ఆలయం, శివాలయంలో నుండి గుర్తు తెలియని వ్యక్తులు గోవులను ఎత్తుకెళ్లుతూ కభేళాలకు తరలిస్తున్నారని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. అనుమానితలు జాబితా ఇచ్చిన పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు చేయగా సమాచారం అందుకున్న ఎఎస్ఐ దేవేంధర్నాయక్ చేరుకొని ఆందోళనకారులతో మాట్లడారు. విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నచ్చజెప్పిన ఆందోళనకారులు శాంతించలేదు. వాహనాలు నిలిచిపోవడంతో జగిత్యాల రూరల్ సిఐకి సమాచారం ఇవ్వడంతో సిఐ కృష్ణారెడ్డి చేరుకొని ఆందోళనకారులతో మాట్లడారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని నిందితులను త్వరలో పట్టుకుంటామని హామి ఇచ్చారు. బిజెపి మహిళమోర్చ జిల్లా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి, విహెచ్పి నాయకులు ఎలగందుల రమేష్, సందనవేని గంగాధర్, రాము, తదితరులు సిఐకి గోమాతల చోరి విషయమై పూర్తి వివరాలు అందజేసారు. సిఐ హామితో ఆందోళనకారులు తమ ఆందోళన విరమించారు.ఫోటో రైటప్: 08RKL02: రాయికల్లో రాస్తారోకో చేస్తున్న దృశ్యం 08RKL02A: సిఐకి వివరాలు అందజేస్తున్న జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి

