–24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన అడ్లూరి
వెల్గటూర్, నేటి సాక్షి.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డు దారుల కు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమం లో భాగంగా మంగళవారం రోజున వెల్గటూర్ మండల కేంద్రం లో రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యా న్ని పంపిణీ చేశారు. అనంతరం వెల్గటూర్ మండలాని కి చెందిన 24 మంది లబ్ధిదారులకు సుమారు ఇరవై నాలుగు లక్షలు గల కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం లో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక రెడ్డి, వైస్ చైర్మన్ గోల్ల తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జుపాక ప్రవీణ్, వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, గండ్ర శ్రీకాంత్ రావు, మెరుగు నరేష్ గౌడ్, సందీప్ రెడ్డి, బందెల ఉదయ్ గౌడ్, గూడ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

