నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ మూర్తులు అశ్వవాహనంపై ఊరేగింపుగా గ్రామ పురవీధుల్లో విహరించారు.సాంప్రదాయ బాజాల మేళతాళాలతో, భక్తుల జై శ్రీ నరసింహ స్వామి నినాదాలతో ఊరేగింపు ఆధ్యాత్మికంగా సాగింది. ఉత్సవ మూర్తుల దర్శనార్థం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి విగ్రహాలకు మహిళలు మంగళహారతులు అందిస్తూ భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు.స్థానికులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

