నేటి సాక్షి , మునగాల కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండ పై రూ. 50ని వెంటనే ఉపసంహరించుకోవాలని. విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ యజమాని చేకూరి లీలావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ. 50కి పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టానుసారం పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ధరల మీద ధరలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ మోపటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు స్వచ్ఛంద తరుపు నుండి పోరాటాలు నిర్వహిస్తామని చేకూరి లీలావతి హెచ్చరించారు.

