నేటి సాక్షి మహబూబాబాద్ (భూక్యా రవి నాయక్)ఏప్రిల్ 11 నర్సింహులపేట మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీవో కిన్నెర యాకయ్య గారు పాల్గొని మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మెజారిటీ ప్రజలైన శూద్రులకు అక్షర జ్ఞానాన్ని దూరం చేసిన మనుస్మృతి పై తిరుగుబాటు చేసిన మహాయోధుడు సామాజిక విప్లవ స్ఫూర్తి శిఖరం జ్యోతిబాపూలే పూలే దంపతుల వల్లే దేశంలో మెజారిటీ ప్రజలకు విజ్ఞాన దారులు ఏర్పడ్డాయి అన్నారు అనంతరం గునిగంటి మోహన్ మాట్లాడుతూ కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి శూద్రులు చదవకూడదు చదువును వినకూడదు అనే నాటి సామాజిక విషమ షరతులను తెగ నరికిన మహానీయుడు పూలే మన్వాద కబంధహస్తాల్లో నలిగిపోతున్న విద్యను సమాజంలో మనుషులందరికీ సమానంగా దక్కాలని పరితపించాడు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు మందుల యాకూబ్ జాటోత్ సురేష్ రమేష్ సైదులు తదితరులు పాల్గొన్నారు

