Monday, January 19, 2026

నల్గొండ జిల్లాలో అక్రమ వైద్యులపై…తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు

-పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు

నేటిసాక్షి, నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా గతంలో కాంపౌండర్లుగా పని చేసి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎంసి), టీఎస్ఎంపిఆర్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల వేషధారణలో ప్రజలను మోసం చేస్తూ, మానవ జీవితాలను ప్రమాదంలోకి నెట్టిన అక్రమ వైద్యులపై రిజిస్టర్ డా డి. లాలయ్య కుమార్, చైర్మన్ డా కె. మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సంబదిత పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేయబడ్డాయి.
ఈ నేపథ్యంలో, క్రింది నకిలీ వైద్య సంస్థలు మరియు వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో BNS 318,319, NMC ACT 34,54, TSMPR ACT 22 ప్రకారం FIR NO : 157/2025, 94/2025, 129/2025
నమోదయ్యాయి. నల్లగొండ
వన్ టౌన్ పోలీస్ స్టేషన్
1. శ్రీనివాస శ్రీ లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, డీవీకే రోడ్, నల్గొండ – నిర్వహణ: ఏ. యాదయ్య
2. సౌమ్య సుజని పాలీ క్లినిక్, మునుగోడు సర్కిల్, డీవీకే రోడ్, నిర్వహణ: పాలకురి వెంకటేశ్వర్లు
3. యశ్వంత్ క్లినిక్, ముషంపల్లి రోడ్, నిర్వహణ: కృష్ణా రెడ్డి, నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ 4. బాలాజీ క్లినిక్, శ్రీనగర్ కాలనీ, నిర్వహణ: వి. శ్రీనివాస్

  1. దేవి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ & ఫ్యాన్సీ స్టోర్, ఏనీనగర్ – నిర్వహణ: జి. రామకృష్ణ
  2. ఉపేంద్ర ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ & డయాగ్నొస్టిక్ సెంటర్, ఎన్.జీ. కాలేజీ సమీపంలో, నిర్వహణ: జి. ఉపేంద్ర
    1. హెల్త్ కేర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ & ల్యాబ్, ఎస్.ఆర్. గార్డెన్ సమీపంలో, నిర్వహణ: రిజ్వాన్, మునుగోడు పోలీస్ స్టేషన్ 8. నగెల్ల అంజయ్య క్లినిక్, నల్గొండ మెయిన్ రోడ్ – నిర్వహణ: నగెల్ల అంజయ్య
    2. లక్ష్మి శివాని హాస్పిటల్, హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా – నిర్వహణ: నలపరాజు వెంకన్న, తిప్పర్తి పోలీస్ స్టేషన్
    3. జోయ్ క్లినిక్, తిప్పర్తి, నిర్వహణ: ఎస్. రత్నం,
    4. మోక్షిత క్లినిక్, తిపర్తి, నిర్వహణ: నూకల నాగేశ్,
    5. ప్రణీత్ క్లినిక్, తిప్పర్తి గ్రామం, నిర్వహణ: వెల్లంపల్లి రమేష్,
    6. శంకర్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, కజిరామారం, నిర్వహణ: ఎం. శంకర్, 14. ఎక్సలెంట్ ఐ కేర్ & ఫస్ట్ ఎయిడ్ సెంటర్, తిప్పర్తి – నిర్వహణ: షేక్ ఖలీం,
      ఫిర్యాదులు మొదట జూన్, 16వ తేదీ, 2024 తేదీన నమోదు చేయబడ్డాయని తెలిపారు. అనంతరం రెండవ విడతగా 08-జనవరి-2025 తేదీన కొనసాగించబడ్డాయని అన్నారు.
      సంబంధింత నకిలీ వైద్యులు అయిన కాంపౌండర్లు ఆర్ ఎం పి/పిఎంపి అని పేర్కొంటూ, తమకి తాము వైద్యులమూ అని నమ్మపలుకుతు, ఇష్టరీతినా ఆంటిబయోటిక్, స్టేరోయిడ్స్, నొప్పినివారణ, ఇంజెక్షన్స్ వారివద్దకు
      వచ్చే రోగులకు ఇస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టుగా తనిఖీ అధికారులు గుర్తించారు.
      ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అక్రమ వైద్యులను నిలువరించేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్యలుగా తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డా జి.శ్రీనివాస్ తెలియ చేశారు. అధికారికంగా అర్హత ఉన్న, నమోదిత డాక్టర్లనే సంప్రదించండి. ఆర్ఎంపి అని బోర్డు పెట్టుకొని అక్రమంగా అల్లోపతి వైద్యం చేస్తున్న ఏవైనా క్లినిక్స్/ ఫస్ట్ ఎయిడ్సెంటర్స్ గూర్చి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లేదా జిల్లా వైద్య అధికారి కార్యాలయానికి, లేదా
      91543 82727 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఫిర్యాధులు చేయవచ్చని,
      పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి.నరేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News