నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుంకయ్యల మారెమ్మ (89) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన మారెమ్మ 2013 – 2016 సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. మారెమ్మ మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

