నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : బీరెల్లి దానయ్య, మాట్లాడుతూ మే 20 తారీకున జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలు మండలం, పెద్ద ధన్వాడ గ్రామం, లో జరగబోయే భారతరత్న, నవభారత నిర్మాత డాక్టర్, బి.ఆర్ అంబేద్కర్ మరియు మహాత్మ జ్యోతిబాపూలే, ఇద్దరి మహనీయుల విగ్రహావిష్కరణ మన నడిగడ్డ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
పెద్ద ధన్వాడ గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, నడిగడ్డ ప్రాంతంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు భారతదేశంలోనే అణగారినప్రజలకు విద్యాబుద్ధులు నేర్పిన, గొప్ప సంఘసంస్కర్త, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
మే 20వ తారీఖున పెద్ద ఎత్తున మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు మే 20 తారీకున, రాజోలి మండలం, పెద్ద దన్వాడ చేరుకొని విజయవంతం చేద్దామని వారు పిలుపునిచ్చారు.

