నేటిసాక్షి, మిర్యాలగూడ :
రేషన్ డీలర్ల ఎంపిక చేయుట కొరకు పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వ్రాత పరీక్షను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 30 రేషన్ డీలర్ల షాపుల కొరకు పరీక్షను నిర్వహించగా, రేషన్ డీలర్ల ఎంపిక పరీక్షకు మొత్తం 336 మంది సభ్యులకు గాను, 305 మంది హాజరయ్యారని, 31 మంది గైర్హజరు కావడం జరిగిందని విలేకరులకు తెలిపారు. వారి వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

