-ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
-డాక్టర్లుతో ప్రత్యేక సమాచారం నిర్వహణ
-రోగులతో సదుపాయాలపై వివరాలు సేకరణ….
నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని
స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగులకు అందుబాటులో ఉండాలని, డాక్టర్లు అందరూ విధిగా విధులకు హాజరుకావాలని, సూచించారు. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో, నియోజకవర్గంలోని కార్మికులు, పేదలు, పరిసర ప్రాంత ప్రజలు అధికంగా ఏదో ఒక సమస్యతో ఏరియా ఆసుపత్రికి వస్తుంటారని, కావున వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుందని,
వైద్యులు ఎవరైనా సమయపాలన పాటించకపోయినా, డ్యూటీ సమయంలో హాస్పిటల్ లో లేకపోయిన వారి పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శానిటైజేషన్ విషయంలో నిత్యం శుభ్రం చేస్తూ, హాస్పిటల్ కి వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా శుభ్రం చేసుకోవాలని అన్నారు.
మన నల్గొండ జిల్లాలోనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి అత్యధికంగా ప్రజలు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడే అత్యధికంగా ప్రతీ నెల కొన్ని వందల డెలివరీలు, సర్జరీలు జరుతున్నాయి అంటే ఇది సామాన్యమైన విషయం కాదాని, ఈ విషయంలో వైద్యులను అభినందిస్తున్నామని అన్నారు. సామాజిక బాధ్యతతో పేద ప్రజలకు తమ వైద్య సేవలను అందిస్తూ, ఏరియా ఆసుపత్రిలో వైద్యం అంటే ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఉంది అనే విధంగా ఉండాలని అన్నారు. అనంతరం హాస్పిటల్ అంతా పరిశీలించి, రోగులతో మరియు ప్రజలతో కలసి మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని హాస్పిటల్ లో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు, మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

