Monday, April 6, 2026

వైద్యం.. వ్యాపారం

కొన్ని ప్రైవేట్ హాస్పటల్లో కాసుల దందా..

రోగుల బిల్లులో 50 శాతం ఆర్.ఎం.పి ఇతర విభాగాలకు కమిషన్ల కోసమే..

అవసరం లేకపోయినా రోగికి అత్యవసర వైద్యం…

ఆర్.ఎం.పి లకు రిఫరల్ ప్యాకేజీ — ప్రత్యేక ఆఫర్లు..

ఆర్ఎంపీల దందాతో గుల్లవుతున్న సామాన్యుల జేబులు..

వైద్యం పై స్పెషల్ ఆపరేషన్ (నేటి సాక్షి దినపత్రిక)

నేటి సాక్షి, ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో (పాముల రాఘవేందర్)

ప్రజలకు ఎంతో ముఖ్యమైన వైద్య రంగంలోని కొందరు నిర్వాహకులు, వైద్యులు కాసుల కక్కుర్తి తో పక్కదారులు తొక్కుతున్నారు. సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ స్థాయి వైద్యులతో కుమ్మక్కై అమాయక ప్రజలతో ఆటలాడుతున్నారు. అది ఏ రంగమైనా వ్యాపార దృక్పథంతోనే సమాజంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రజలకు ఎంతో ముఖ్యమైన వైద్య రంగంలోని కొందరు ఆస్పటల్ నిర్వాహకులు, వైద్యులు కాసుల కక్కుర్తి తో పక్కదారులు తొక్కుతున్నారు. సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ స్థాయి వైద్యులతో కుమ్మక్కై అమాయక ప్రజలతో ఆటలాడుతున్నారు. గ్రామీణ ప్రజలను తమ ఆస్పటల్ కి తీసుకొచ్చిన దగ్గర నుంచి హాస్పటల్ నుంచి వెళ్లే వరకు అయ్యే బిల్లులో తగిన కమిషన్ ఇస్తూ వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చేశారు. కొంతకాలం నుండి గుట్టుగా సాగుతున్న ఈ దందా. ప్రస్తుతం అది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. కమిషన్ల దందాలో భాగంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యులు రోగుల నుంచి అందిన కాడికి పిండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని ప్రజలను కఠినమైన వ్యాధులతో వణికిస్తున్నాయి. దాంతో ప్రజలు జ్వరం వస్తే చాలు పట్టణంలోని హాస్పటల్ కు పరుగులు పెడుతున్నారు. పరిస్థితులను ఆసరాగా తీసుకుంటున్న పలు ప్రైవేట్ హాస్పిటల్ వారు రోగి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం ఉన్న లేకపోయినా టెస్టులు, మందులు రాస్తూ.. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ల్యాబ్ లు, బ్లడ్ బ్యాంకులు, మందులు ఇలా ప్రతి దాంట్లో కమిషన్ దందా కొనసాగుతుండగా.. హాస్పిటల్స్ కు వచ్చిన రోగులు, వారి కుటుంబీకులు ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారు.

రోగుల బిల్లులో 50 శాతం పైగా కమిషన్లకే

రోగిని ఆస్పటల్ కు తీసుకొచ్చినందుకు, హాస్పిటల్ లో చేర్పించాల్సి వస్తే డిశ్చార్జ్ అయ్యే సమయంలో.. పలు రకాలుగా ఆసుపత్రి నిర్వహకులు రోగికి వేసే బిల్లులో 50 శాతం పైగా కమిషన్లకే కేటాయిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా మధ్యలో నిర్వహించే టెస్టుల్లోనూ కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక రోగిని హాస్పిటల్ లో టెస్టుల కోసం తీసుకెళ్తే బ్రెయిన్ సిటీ స్కాన్ కి రూ.800, ఎం ఆర్ ఐ స్కానింగ్ కి రూ.2000, ఈ ఈ జి కి రూ.800, ఇంకా ఏమైనా టెస్టులలో ఆర్ఎంపీలకు కమీషన్లు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఆయా స్కానింగ్ ల్లోనూ అత్యధికంగా తీసుకొచ్చిన ఆర్ఎంపీలకు కమీషన్ పర్సంటేజ్ పెరుగుతుందని సమాచారం. వీటితోపాటు ల్యాబ్ లో నిర్వహించే పరీక్షల్లో ప్రతి పరీక్షకు 30 శాతం, మెడికల్ షాపుల్లో అయ్యే బిల్లులో 15 శాతం కమిషన్లు ముట్టజప్తున్నట్లు తెలుస్తుండగా.. ఇదే స్థాయిలో ఆయా టెస్టులు, మందులు రాసిన వైద్యులకు కూడా కమిషన్లు చేరిపోతున్నట్లు తెలుస్తుంది.

ఆర్ఎంపీలకు బంపర్ ఆఫర్లు ఇలా…

హాస్పటల్ తో పర్సంటేజీలు మాట్లాడుకున్న ఆర్ఎంపీలు, పీఎంపీలు హాస్పటల్ నిర్వాహకులు పర్సంటేజ్ లతోపాటు మరికొన్ని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నెలల వారీగా లక్కీ విజేతలను ప్రకటిస్తున్నారు. ఈ నెలలో ఎక్కువమంది రోగులను తీసుకొస్తే చాలు నజారాణాలు ముట్ట చెబుతున్నారు. డబుల్ డోర్ ఫ్రిజ్ , బైక్, వాషింగ్ మిషన్లు అందజేస్తున్నారు. వాటన్నిటితో పాటు మరికొన్ని గృహప్రకారాలు ఇస్తున్నారు. సంవత్సరం మొత్తంలో ఎక్కువ మంది రోగులను తీసుకొచ్చి, హాస్పటల్లో అత్యధిక బిల్లులు చెల్లిస్తే ఏకంగా కారునే గిఫ్ట్ గా ప్రకటిస్తున్న సంఘటనలు కూడా ఉమ్మడి జిల్లాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ కి వచ్చిన ప్రతిసారి ఆర్ఎంపీలకు విందు, ఓ గిఫ్ట్, ప్రతి నెలకోసారి ఇతర ప్రాంతాలకు టూర్లు అవకాశం లేదా జేబులు నింపటం. ఇది ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలలోని వైద్యరంగంలో జరుగుతున్న వ్యాపారం. అంతేకాదు జిల్లాలలోని ఆర్ఎంపీలను, ఇతర చిన్న క్లినిక్ల డాక్టర్లను కలిసేందుకు ప్రతిరోజు జిల్లాల లోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి పర్సంటేజీలు మాట్లాడేందుకు ప్రత్యేకంగా హాస్పటల్లో పి ఆర్ ఓ ల వ్యవస్థను నెలకొంది. అలా మాట్లాడేందుకు అనుభవం కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. హాస్పటల్ ప్రారంభించినప్పుడే కాదు ఎల్లవేళలా ఈ పని చేయాల్సి వస్తుందని ఒకరిద్దరూ హాస్పటల్ నిర్వాహకులే వాపోయారు. అలా చెయ్యని హాస్పిటల్ లో రోగులు రాక హాస్పటల్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నంత అధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సాధించాలని, కమిషన్ల దందాను నియంత్రించాలని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని ప్రజలు కోరుతున్నారు.

ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహకుడి అభిప్రాయం..

నూతనంగా ఆస్పటల్ ప్రారంభించాలనుకునే వారు ముందుగా గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ, పిఎంపి లతో సంబంధాలను పెంచుకోవాల్సి వస్తుంది. ఎంత అనుభవం ఉన్న డాక్టర్లు అయినా వ్యవస్థతో సమానంగా నడుచుకుంటూ వైద్యరంగంలో రాణించాలంటే కొన్ని అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ వైద్యులకు ముందుగానే కలిసి పర్సంటేజ్ మాట్లాడు కొవలసిన పరిస్థితి లేదంటే హాస్పటల్ ముగింపు పలకడమే..

హాస్పిటల్ కు వచ్చిన ఓ రోగి ఆవేదన..

మాకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా సరే.. పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి ముందు ఊర్లో ఉన్న ఆర్ఎంపీని కలవాల్సిందే. ఫలానా హాస్పిటల్ వెళ్లండి నేను చెప్తాను. కొన్నిసార్లు ఆయన కూడా మా వెంట వస్తాడు. మేం చెల్లించే డబ్బులు ఎంతోకొంత ఆయనకు వస్తుందని నేను నేరుగా వెళ్తే అది తగ్గుతుందని తెలుసు. కానీ ఒకవేళ ఆయన్ని కాదని మేం వెళ్తే.. మున్ముందు ఎప్పుడైనా చిన్న సూది వేయాలన్నా, గోలీలు ఇవ్వాలన్నా ఆయన రాడు. అందుకే తప్పనిసరి వెంటబెట్టుకొని వస్తాం..

ఓ ఆర్ ఎం పి చెప్పిన మాట ఇది

అన్ని రంగాలతో పాటు వైద్యం కూడా వ్యాపారంగా మారింది.రూ. లక్షల్లో జీతాలు పొందే డాక్టర్లే పెద్ద హాస్పిటల్ కు రిఫర్ చేసినందుకు, టెస్టులు, మందులు ఇలా ప్రతి దాంట్లో కమిషన్లు వస్తాయి. వాళ్లతో పోల్చుకుంటే ఆర్ఎంపీలు చాలా తక్కువే. మేం డబ్బులు తీసుకున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు సార్విస్ చేశామన్న తృప్తి మిగులుతుంది. మేం లేకపోతే వారు ఎక్కువ మోసపోయే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News