Monday, April 6, 2026

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 4 రోజులు జైలు శిక్ష

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్.ఐ సతీష్ తమ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఎల్లల రవీందర్ రెడ్డి (45)వెనుగుమట్ల గ్రామానికి వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా ఎల్లల రవీందర్ రెడ్డి, అతని పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ జి. కరుణాకర్ ముందు హాజరుపరుచగ అతనికి 4 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది గొల్లపల్లి ఎస్.ఐ సతీష్ మాట్లాడుతూ. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన వారు ప్రమాదాలను ఎదుర్కొనడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం జరుగుతుంది, కావున దీనిని తీవ్రంగా పరిగణిస్తూ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News