Monday, January 19, 2026

ట్రాఫిక్​ సమస్య పరిష్కరించిన ఎస్ఐ మల్లేష్

నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )

జగిత్యాల ప్రధాన కూరగాయల మార్కెట్ విద్యానగర్​​ పరిధిలో రైతులు తమ కూరగాయలను రోడ్లపై అమ్మడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పలుమార్లు ప్రజావాణిలో పిర్యాదులు రావడంతో స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ వారి సిబ్బంది తో కలిసి మార్కెట్ నీ పరిశీలించారు. ట్రాఫిక్​ పోలీసులు, వ్యాపారస్తులతో మాట్లాడి, ట్రాఫిక్​ సమస్య ఉత్పన్నం కాకుండా చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యానగర్ ప్రజలు ఎస్ఐ మల్లేష్ స్పందించిన తీరుకి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్ల పై కూరగాయలు పెట్టవద్దని వ్యాపారులకు సూచించారు. ట్రాఫిక్​ పోలీసులకు సహకరిస్తూ వ్యాపారం చేసుకోవాలని అయిన తెలిపారు. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News