భూ భారతి ద్వారా భూ సమస్యలను తీర్చుకోవాలి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొనీ,సదస్సుకు వచ్చిన ప్రజల భూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని,ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలు ఏమి ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చునని,భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందే భూ భారతి చట్టమని,అందులో భాగంగా బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందని,ప్రజలు ఇట్టి రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

