నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం,గత స్మృతులు,కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు, గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో 2004-2005 గుట్రాజుపల్లి గంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి.తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 గుట్రాజుపల్లి గంగపూర్ సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది. ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు,ఎక్కడెక్కడో స్థిర పడిన వారు.కొందరుఉద్యోగాల్లో కొందరు,సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే తలంపులో ఆనాటి విద్యార్థులైన కొంత మంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు, తమ కుటుంబ పరిస్థితులు, నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు.ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు, పాటలు అలరించాయి.సాయంత్రం వరకు అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. స్కూల్ మరియు ఊరి అభివృద్ధి లో కూడా మంచి పాత్ర పోషించాలనీ నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

