Monday, January 19, 2026

రాజీవ్ యువవికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం పాండురంగారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)

నిరుద్యోగ యువతకు ఊతం కాంగ్రెస్ ప్రభుత్వం అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు.
బుధవారం ఒక ప్రకటనలో..
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక ప‌దేండ్ల‌లో
గ‌త బీఆర్ఎస్ స‌ర్కారు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌లేదు అని
ఏడాదికి ఒక‌టో.. రెండో ఇచ్చినా.. అందులో కొన్ని పేప‌ర్‌లీక్స్‌తో వాయిదాప‌డుతూ వ‌చ్చాయి.
దీంతో ప్ర‌త్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి.
మ‌రోవైపు నిరుద్యోగుల‌కు ఉపాధి తోవ చూపేందుకు గ‌త బీఆర్ఎస్ స‌ర్కారు
కార్పొరేష‌న్ రుణాల‌ను కూడా ఇవ్వ‌లేదు. అటు ఉద్యోగాలు లేక‌.. ఇటు ఉపాధి లేక నిరుద్యోగుల జీవితాలు నీరుగారిపోయాయి.
రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ది.
ఓవైపు ప్ర‌భుత్వ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తూనే.. మ‌రోవైపు నిరుద్యోగుల‌కు ఉపాధి తోవ చూపేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించాల‌ని స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. గ‌తానికి భిన్నం రూ. 50 వేల నుంచి రూ. 4ల‌క్ష‌ల వ‌ర‌కు సాయం అందించేందుకు నిర్ణ‌యించింది.నిరుద్యోగుల‌పై భారం లేకుండా గతంలో ఉన్న స‌బ్సిడీని రివ‌ర్స్ చేసి..
70 శాతం ప్ర‌భుత్వం, 30 శాతం ల‌బ్ధిదారుడు భ‌రించేలా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 8,000 కోట్లు కేటాయించింది. నిరుద్యోగుల‌నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది.
కాంగ్రెస్ కార్య‌క‌ర్త అయినా స‌రే.. అర్హ‌త ఉంటేనే సాయం అందించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ సాయంతో నిరుద్యోగ యువ‌త త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డి అటు త‌న కుటంబానికి, ఇటు రాష్ట్రానికి వెన్నుద‌న్నుగా నిలిచేలా తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కారు అడుగులు వేస్తున్న‌ది.
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో 5 ల‌క్ష‌ల మంది
నిరుద్యోగు యవకులు వ్యాపార‌స్తులుగా మారితే
రాష్ట్ర జీడీపీ కూడా గ‌ణ‌నీయంగా పెరుగ‌నతుందని ఆయన తెలియజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News