Tuesday, January 20, 2026

భూ..భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )

భూ సమస్యల పరిస్కారమే ద్యేయంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బీరుపూర్ మండలం తహశీల్దార్ సుజాత కోరారు.
బుధవారం మండలం లోని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సును మండల రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సుజాత మాట్లాడుతూ రైతులు తమకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 3 తేదీ నుండి మండలంలోని అన్ని గ్రామాలలో 20 వ తేదీ వరకు జరుగుతున్న సదస్సులలో భూమికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సదస్సులో
రైతులు పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కరించు కోవాలని రైతులు ఈ సదావకాశాన్ని ఉపయోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ సుజాత ఆర్ ఐ రాహుల్ మాజీ ఎంపిపి రమేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News