రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు*..*సూపర్ సిక్స్ పథకాల అమలతో ప్రజల జీవితాలలో వెలుగులు**ఏడాది పాలన పై స్పందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*.. *చిత్తూరు* నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)కూటమి ప్రభుత్వంతోనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో.., ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…,కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఓ ప్రకటనలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి.., ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నారని చెప్పారు.సూపర్ సిక్స్ పథకాల అమలతో ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఇప్పటికే కేంద్ర నుంచి వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించి, పోలవరం ప్రాజెక్టు.., అమరావతి నిర్మాణాలను పట్టాలెక్కించి.., ఏపీ ప్రగతికి బాటలు వేసారని ఆయన తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపేందుకు.., ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి,.. శంకుస్థాపనలు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఎంతో ప్రగతిని సాధించామని.., భవిష్యత్తులో ప్రజలు శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తామని..చెప్పడానికి తాను గర్వపడుతున్నట్లు చిత్తూరు ఎంపి ఆనంద వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు ఇదో నిదర్శనమన్నారాయన.