నేటి సాక్షి, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని పెర్కబండ – గుండారం గ్రామాలకి చెందిన కర్రావుల హర్షవర్ధన్ ఓస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో స్టేట్ 1st ర్యాంక్ సాధించి మండలానికి గొప్ప గౌరవం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలకేంద్రంలోని బాలికల పాఠశాల ఆవరణలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో హర్షవర్ధన్‌ను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు, ఉపాధ్యాయులు తప్పేట ఒదయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించడం అభినందనీయం.హర్షవర్ధన్ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి, ప్రస్తుతం మర్కూక్ మండలం తీగుల గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తిగా మండలంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలన్న ఆకాంక్షను కలిగించాలి,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతకింది పర్శరాములు, తాడిచెట్టు భూమయ్య, స్వేరో నాయకులు బోనగిరి ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రామంచ రవి, తిరుమలయ్య,బోనగిరి ఆనందం, బోనగిరి చంద్రయ్య, మంకాల రాజు, లింగాల శ్రీను, బి. లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

