నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 10,, నారాయణ పేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మంత్రి గా అయినందుకు గాను పేట నియోజకవర్గం లోని మరికల్ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ చౌరస్తాలో పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరికి ఘనంగా శాలువలతో గజమాలతో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఇంద్ర గాంధీ చౌరస్తా లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ వెంకటరామరెడ్డి, గొల్ల కృష్ణయ్య, శివకుమార్, బెలగొంది వీరన్న, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి, మరికల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, నాయకులు మండల నాయకులు భూప నర్సింలు, బంగారు నారాయణ, జనార్ధన్, శ్రీనివాసులు ఏ, ఆంజనేయులు, సూర్య ప్రకాష్ ఆనంద్ కుమార్ తదితరులు

