పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగాలి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
ఏఐటీయూసీ ఎర్రజెండా అండతో హమాలీల బ్రతుకుల లో వెలుగులు నింపుదాం
నగర మహాసభలకు హమాలీ కార్మికులను సన్నద్ధం చేద్దాం
శ్రీ బాలాజీ లారీలోడింగ్ మరియు అన్లోడింగ్ హమాలీ వర్కర్స్ యూనియన్ తిరుపతి నగర సమితి సమావేశం స్థానిక బైరాగి పట్టేడ లో గల ఏఐటియుసి నగర కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ డి రవి హాజరై ప్రసంగించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీడేట్లు పెరగాలని అందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వారు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని అలాగే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికు లకు ఎలాంటి సంక్షేమ చట్టం ఉన్నదో అలాంటి సంక్షేమ చట్టాన్ని హమాలీ కార్మికులకు కూడా ఏర్పాటు చేయాలని ఈ సంక్షేమ చట్టంలో 50 సంవత్సరములు నిండిన ప్రతి హమాలీ కార్మికులకి కనీసం పదివేల రూపాయల పింఛన్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించే విధంగా చేసే పనిలో ప్రమాదాలు జరిగితే గ్రూప్ ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేసి హమాలి కార్మికులను ఆదుకునే విధంగా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రెక్కాడితే గాని డొక్కాడని హమాలీ కార్మికులకు ప్రభుత్వం చేదోడుగా నిలవాలని అలాంటి సంక్షేమ చట్టం సాధనకు ఏఐటియుసి ఎర్రజెండా ఆధ్వర్యంలో రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టాలని అందుకు తిరుపతి నాంది కావాలి అని ఆయన పిలుపునిచ్చారు
అలాగే త్వరలో హమాలీ యూనియన్ నగర మహాసభలు జరపాలని అందులో గత రెండు సంవత్సరాల కాలంగా హమాలీ కార్మికులు చేపట్టిన పోరాటాలను సమీక్షించి రానున్న కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల పెంపు అలాగే సంక్షేమ చట్టం సాధనకు పోరాటం నిర్మాణం విస్తరణ ప్రధాన అజాండగా మహాసభలు నిర్వహించాలని సన్నద్ధం చేయాలి అని ఆయన కోరారు
ఇంకా ఈ సమావేశంలో హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ బాబు. ఈ సమావేశానికి నగర నాయకులు సారధి అధ్యక్షత వహించారు. నాయకులు సెండిల్ మోహన రాజేష్ శీను గణేష్ మునికృష్ణ వెంకటేష్ రామకృష్ణ వెంకటేష్, హమాలీ నగరనాయకత్వం పాల్గొన్నారు