Tuesday, January 20, 2026

వరంగల్ పోలీస్ నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలపై సమాచారం ఇవ్వండి సన్ ప్రీత్ సింగ్

*నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వానకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై పరంగల్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన ప్రచార పోస్టర్లను మంగళవారం పోలీస్ కమిషనర్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేస్తూ ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను, పురుగు మందులు విక్రయిస్తుతే పిడి యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరుగుతుందని నకిలీ విత్తనాలను విక్రయాలను నియంత్రియించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఒక కోటి 23 లక్షల విలువ నకిలీ పురుగు మందులు, విత్తనాలతో పాటు పెద్ద ఎత్తున గడ్డి మందును స్వాధీనం చేసుకోవడంతో పాటు 14మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగిందని. ఇకపై ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకు గాని లేదా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫోన్ నంబర్ 7799848333 ఫోన్ నంబరకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, డేవిడ్ రాజు, ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News