నేటి సాక్షి,రామడుగు (పురాణం సంపత్)విద్యార్థులకు మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి అధికారులను సూచించారు.ఈ సందర్భంగా మంగళవారం రామడుగు మండలం వెదిర కస్తూరిబా బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫుడ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని సందర్శించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో తప్పనిసరిగా మెనూ అమలు చేయాలని, అలాగే ఎటువంటి లోటుపాటు లేకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేశ్వరి,స్పెషల్ ఆఫీసర్ కవిత,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

