ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వారిని భర్తీ చేసే చర్యలు చేపట్టాలి
లాంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
అజ్మీరా సుశీల బాయి డిమాండ్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హన్మకొండ లోని లష్కర్ బజార్ లోని టైలర్ ట్రెనింగ్ సెంటర్ ని లాంబాడ హక్కుల పోరాట సమితి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అజ్మీరా సుశీల బాయి సందర్శించారు. ఈ సందర్భంగా సుశీల బాయి మాట్లాడుతూ ప్రతి ఏటా వేల సంఖ్యలో నిరుద్యోగులు డ్రాయింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారని , ప్రతి గురుకులంలో ఒక క్రాఫ్ట్ టీచర్ ఉండాలనే నిబంధనలు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని భర్తీ చేయడం లేదని వాటిని వెంటనే భర్తీ చేసి ట్రెనింగ్ తీసుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు
భర్తీ చేయక పోవడం వల్ల విద్యార్థులు సైతం ఎంతో నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్త పరిచారు కుట్టు మెషిన్ లలో చిత్ర లేఖనం లో నైపుణ్యాలను నేర్పించుటకు అనేక సెంటర్ లు ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకున్న వారికి ఉపాధి కల్పించక పోవడంతో ప్రయోజనం లేదని అన్నారు
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆ కాళీలు భర్తీ చేయాలని
సుశీల బాయి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎన్. సుగుణ, బి. ఉషారాణి, స్వాతి, యం. అరుణ తదితరులు పాల్గొన్నారు.

