పోలేపాక కుమారస్వామి కుటుంబానికి న్యాయం చేయాలి!-బాధితుడికి ఏదైనా జరిగితే కబ్జాదారులదే బాధ్యత!-జిల్లా కలెక్టర్,మంత్రి వేంటనే బాధితుడిని పరామర్శించాలి! –డిబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్!నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం ఉర్సు ప్రాంతానికి చెందిన దళితుడైన పోలెపాక కుమారస్వామి భూమిని కబ్జా చేసి కులం పేరుతో దూషించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కారకులైన భూకబ్జాదారులు బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం భూ కబ్జాదారుల ఆగడాలకు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని 80 శాతం కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలేపాక కుమారస్వామిని దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి భూమిని భూకబ్జాదారులు కబ్జా చేయడంతో పాటు ఆయనను కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించడంతో పాటు మానసికంగా వేధించడం వలన పొలేపాక కుమార స్వామి ఆత్మహత్య ప్రయత్నానికి పూనుకున్నాడని ఆయనకు ఏదైనా జరిగితే భూకబ్జాదాలలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి వెంటనే స్పందించి బాధితుడిని పరామర్శించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారి తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి అధ్యక్షుడు కలకోటి మహేందర్, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, డిబీఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, రావణ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

