నేటి సాక్షి, బెజ్జంకి:
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా ఎల్లమ్మతల్లి పట్నాలు, బోనాలు వైభవంగా నిర్వహించారు.మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఇళ్ల నుంచి డప్పుచప్పుల నడుమ బోనం ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా శివసత్తుల పూనకాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

