Tuesday, January 20, 2026

రైతు నీటిగోస తీర్చిన మహానేతపై విచారణలా.

రాజకీయ కక్ష సాధింపు, వేధింపుల కోసమే కమిషన్ విచారణ.

కెసిఆర్ పై అవినీతి కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్ కు కాలం చెల్లింది.

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నేటి సాక్షి, నర్సంపేట,జూన్ 11: రైతుల నీటీ గోస తీర్చిన మహానేతపై రాజకీయ కక్ష సాధింపు వేధింపుల కోసమే కమిషన్ విచారణ కెసిఆర్ పై అవినీతి కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కారుకు కాలం చెల్లిందని బిఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు బుధవారం పత్రికా విలేకరులతో వారు మాట్లాడుతూ తెలంగాణ కరువును తీర్చిన జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ జాతిపిత ఉద్యమ నేత కేసిఆర్ ని విచారణకు పిలవటం అంటే ఇది తెలంగాణకు చీకటి రోజు కాళేశ్వరం తో కరువు నేలను సస్యశ్యామలం చేసిన గొప్ప నేత కేసిఆర్ పై విచారణ చేపట్టడం అంటే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కాళేశ్వరం గురించి అవగాహన లేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు.
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందుతుంది తెలంగాణను పచ్చని మాగాణంగా గా మార్చిన భగీరధుడు కేసీఆర్.దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను నిలిపింది కేసీఆర్. కెసిఆర్ పేరును మసకబార్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది కుదరదని ఆయన తెలుసుకుంటే మంచిది. రాజకీయ కక్ష సాధింపులు వేధింపులు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత ప్రభుత్వాన్ని గొప్పగా నడిపిన వ్యక్తి కేసీఆర్. స్వరాష్ట్ర సాధన, సాధించిన తెలంగాణలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన నేత కేసిఆర్. 60 ఏళ్లలో తెలంగాణను అరిగోసలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బతుకు మార్చిన కేసీఆర్ పై విచారణ కు పిలవడం అంటే ఇది నిజంగా హేయమైన చర్య. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణ జీవధారనే. యావత్ తెలంగాణ సమాజం రైతన్నలు నేడు కేసీఆర్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణ దిశా దశను మార్చిన కేసీఆర్ ని, వారి స్థాయిని తగ్గించే కుట్ర జరుగుతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ స్థాయి మరింత పెరుగుతుంది తప్ప తగ్గదుగాక తగ్గదు.కమిషన్ ముందు వాస్తవాలను కేసీఆర్ హరీష్ రావు స్పష్టంగా తెలియజేశారు.రేవంత్ సర్కార్కు కాలం చెల్లింది. ఆరు గ్యారంటీ లు అమలు చేయకుండా కక్షసాదింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ప్రజాక్షేత్రంలో రేవంత్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా వారు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News