నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కోరుట్ల మండల స్థాయి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులకు మరియు పాఠశాల పారిశుధ్య సహాయకులకు (స్కావేంజర్) బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ ప్రతి పాఠశాల పరిసరాలు,బాల,బాలికల మూత్రశాలలు,తరగతి గదులు, చెట్లు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో అల్లమయ్య గుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అనిల్ మాట్లాడుతూ వర్ష కాలం కాబట్టి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి, నీటి నిల్వలు పాఠశాల ఆవరణలో ఉండకుండా చూడాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి మార్గం రాజేంద్రప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.ఆనందరావు,ఎ. శ్రీనివాస్,నల్ల భూమయ్య, ch. కృష్ణ మోహన్ రావు,ఆర్.పి శ్రావణ్ ,సి.ఆర్.పి లు పి.గంగాధర్,జ్యోతి,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

