మరికల్ లో అంగన్వాడీ కార్యకర్తల ర్యాలీ నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 11, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలని ప్రాజెక్టు అధికారిని సరోజినీ కోరారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో పలు వార్డులలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంద్ర గాంధీ చౌరస్తా వద్ద మక్తల్ ప్రాజెక్టు అధికారిని సరోజిని మాట్లాడుతూ ప్రాంతాల్లో మూడు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలను కార్యకర్తలు తిరిగి గుర్తించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో అడ్మిషన్లు ప్రారంభించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లల సంఖ్యను అన్నారు. కార్యక్రమంలో మరికల్ మండల అంగన్వాడి సూపర్వైజర్ మహేశ్వరి, కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

