Tuesday, January 20, 2026

శ్రీ సరస్వతి శిశు మందిరం,కోరుట్ల

నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర ):-మన శ్రీ సరస్వతీ శిశు మందిరం, కోరుట్ల పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదుల భవనం ప్రారంభోత్సవం ఈ రోజు అనగా 11-06-2025, బుధవారం రోజున మాన్య శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి గారి చేతుల మీదుగా జరిగింది.ముందుగా ఉదయం పాఠశాలలో గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి సందర్భంగా డాక్టర్ వేముల ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్త గా వచ్చిన శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశభక్తి మిళితం చేసి విద్యాబోధన జరుగుతుందని ఇలాంటి శిశు మందిరం పాఠశాల లను ఎక్కడ ఉన్నా సమాజంలో అందరూ ఆదరించాలని, వాటి అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలని కోరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న శ్రీ బూరుగు సత్యనారాయణ గౌడ్, ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ తను కూడా గతంలో కోరుట్ల శిశు మందిరం పాఠశాల లో చదివానని,పూర్వ విద్యార్థి గా తనవంతుగా సామాజిక బాధ్యతగా తను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి గాను భవన నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.అలాగే శ్రీ పతాకమూరి శ్రీనివాస్ రావ్ ,శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి గారు మాట్లాడుతూ ఇట్టి శిశు మందిరం పాఠశాల దిన దినాభివృద్ధి చెందడంలో పూర్వ విద్యార్థుల మరియు సమాజంలో ఎంతో మంది కృషి ఉందని వీటిని మరింత అభివృద్ధి చేయాలని, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పడం జరిగింది.అలాగే ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న శ్రేయోభిలాషులు నూతన భవన నిర్మాణం కొరకు కొత్త సురేష్ గారు ఒక లక్ష రూపాయలు,వనతడుపుల రవికుమార్ గారు ఒక లక్ష రూపాయలు, బండారు రాజేశ్వర్ గారు ఒక లక్ష రూపాయలు, రేగుంట రాజేంద్ర ప్రసాద్ గారు ఒక లక్ష రూపాయలు, ఇందూరి సత్యం గారు 50 వేల రూపాయలు తమ వంతుగా నూతన భవన నిర్మాణం కొరకు ఆర్థిక విరాళాలు అందివ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బొడ్ల శ్రీనివాస్ గారు, పూర్వ ప్రధానాచార్యులు బండారి కమలాకర్ గారు, పాఠశాల ప్రబంధ కారిణి మరియు సమితి సభ్యులు డాక్టర్ వేముల రవికిరణ్, వడ్లకొండ రాజగంగాధర్, చెట్పల్లి శంకర్, వనపర్తి చంద్ర మోహన్,ఎలిమిల్ల మనోజ్ కుమార్, అందె శివ ప్రసాద్,నీలి శ్రీనివాస్ ,ముదిగొండ రాజేశం, బీమనాతి రాజ గంగారాం, పిస్క రమేష్, కొండ బత్తిని అమర్ నాథ్, కొత్త సందీప్, తాటికొండ విశాల్ మరియు పుర ప్రముఖులు,పూర్వ ఆచార్యులు, విద్యార్థులు, పోషకులు మరియు ప్రధానాచార్యులు గోపు వెంకటేష్ మరియు ఆచార్య బృందం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News