నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్) రామడుగు మండలం వీధిర గ్రామంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఎన్ సీసీ శిక్షణ శిబిరంలో బుధవారం కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయుధాలపై, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడే ఎన్సిసి భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవతో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంలో సఫలీకృతం అవుతుందని తెలిపారు. అనంతరం ఆయుధాల అవసరం నిమిత్తం వాడాలని అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించే విధానాలను సైతం విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా ఆయుధాల నిర్వహణలో భాగంగా ఉపయోగపడే పలు రికార్డులను విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్వల భాగ్యశ్రీ, ఏం రజినీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

