పెండింగ్ కేసులపై సమీక్ష…
- నూతన కానిస్టేబుల్ లకు పలు సూచనలు
నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్)
రామడుగు మండలం పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ గౌస్ సలాం తనకి చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులను,పెండింగ్ కేసులను పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ నమోదైన కేసుల వివరాలు సి సి టి ఎన్ఎస్ లో పొందుపరచాలని సూచించారు.అనంతరం పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి వాటికి గల కారణాలను తెలుసుకొని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.అలాగే నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ లకు పలు సూచనలు,స్టేషన్లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలని,రికార్డు నిర్వహణ,కోర్టు డ్యూటీ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,బీట్,పెట్రోలింగ్ మొదలగు వాటి గురించి సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అన్ని గ్రామాలను సెక్టార్లుగా,సబ్ సెక్టార్లుగా విభజించి వాటికి గ్రామ పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.అలాగే రౌడీషీటర్లు,హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసిపి శుభం ప్రకాష్,చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్,రామడుగు ఎస్సై రాజు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

