మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి..నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ )ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి అన్నారు.రుద్రంగి మండలకేంద్రంలో బుధవారం గడ్డం నారాయణ అనారోగ్యంతో బాధపడగా ఆయన మెరుగైన ఆరోగ్యానికి ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మంజూరు కాగా అట్టి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతిస్తున్నారని, ప్రతి పేదవారి ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పెద్దలు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గట్ల మీనయ్య, నాయకులు తర్రే మనోహర్,తర్రే లింగం, ఎర్రం గంగ నరసయ్య, గండి నారాయణ, పల్లి గంగాధర్, దయ్యాల, శ్రీను,అభిలాష్,స్వర్గం పరంధాం, కట్కూరి దాసు, దాసరి గంగారాజంలైఫ్ తదితరులు పాల్గొన్నారు.

